సెమీఫైనల్లోకి పీవీ సింధు
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 11-21, 21-12, 21-17 తేడాతో సుపనిద కాతెతింగ్ పై విజయం సాధించింది. 1గంట 5 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సింధు ఆకట్టుకుంది. సెమీస్ లో రష్యాకు చెందిన ఎవ్జెనియా కోస్తెకయాతో సింధు తలపడుతుంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో ప్రణయ్ 19-21, 16-21 తేడాతో ఆర్నార్డ్ మెర్కలె ( ఫ్రాన్స్ ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మరో క్వార్టర్స్ లో మిథున్ మంజునాథ్ 11-21, 21-12, 21-18 తో సెర్గె సిరాంట్ ( రష్యా)పై గెలిచి సెమీస్ లోకి ప్రవేశించాడు.