సెంచూరియన్ : దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. గురువారం ఇండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత డీకాక్ ఈ ప్రకటన చేశారు. తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీకాక్ తెలిపాడు. 2014లో డీకాక్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు టెస్టుల్లో 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు. మొత్తం 54 మ్యాచుల్లో డీకాక్ 6 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు చేశాడు.
డీకాక్ భార్య సాషా త్వరలో బేబీకి జన్మనివ్వనున్నది. ఈ నేపథ్యంలో డీకాక్ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపాడు. వన్డేలకు, టీ20లకు అందుబాటులో ఉండనున్నట్లు చెప్పాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలో మోకాలిపై కూర్చుని నివాళి అర్పించాలని బోర్డు కోరగా, ఆ మ్యాచ్ కు డీకాక్ దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోర్డుకు డీకాక్ క్షమాపణలు చెప్పాడు.