నవాబు కాలాన్ని నయా జమానాని ముందుండి నడిపిందిరా
మొన్నైన నిన్నైన నేడైన రేపైన జండాలా ఎగిరిందిరా
కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని భాషల్ని దండల్లే అల్లిందిరా
అలాయి బలాయి బిర్యాని మా చాయి గుండెల్ని దోచిందిరా
హే మన నగరం హైద్రాబాదు..ప్రేమల నగరం రా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
హే మన నగరం హైద్రాబాదు..ప్రేమల నగరం రా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
ఆనాడు రిక్షాలురా సూడంగ ఈనాడు మెట్రోలురా
రింగుల ఆ రోడ్డులా క్షేమంగ గమ్యాన్ని చేర్చేనురా
పొద్దున్న నమాజులా రాత్రుల్లో పోలీసు సైరనులా
నీతోటే లేస్తుందిరా భద్రంగ కాపల కాస్తుందిరా
చదువులు పంచగ గురువయ్యే ఫ్యూచర్ మార్చగ కొలువయ్యే
ప్రోత్సాహాలకు నెలవయ్యే స్టేటస్ కే ఇది సింబల్ రా
హే మన నగరం హైద్రాబాదు..ప్రేమల నగరం రా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
హే మన నగరం హైద్రాబాదు..ప్రేమల నగరం రా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
ట్రెండును అందుకుందే బ్రాండులో అంతట ముందు ఉందే
గ్లోబును తిప్పుతుందే అందరి చూపును తిప్పుకుందే
అమ్మల్లె ఆదుకుందే నాన్నయ్యి భరోస ఇస్తఉందే
వెన్నెల వెలుగులనే బస్తీలు నగరానికిస్తుఉందే
విజనే కలిగిన నాయకులు స్వచ్ఛత నిలిపే శ్రామికులు
హెల్త్ ని గాచే సేవకులు సేఫెస్ట్ ప్లేసనే ధైర్యంరా
హే మన నగరం హైద్రాబాదు..పచ్చని నగరంరా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
హే మన నగరం హైద్రాబాదు..ప్రేమల నగరం రా
హే మన నగరం హైద్రాబాద్..అందరి నగరం రా
సంతోషాల సంగీతమే హైదరాబాదు తెలంగాణ గుండె చప్పుడు రా..