లక్నో పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు మరో విజయం దక్కింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో కేవలం 3 రన్స్ తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగల్గింది. రాజస్థాన్ విధించిన 165 రన్స్ టార్గెట్ ను ఛేదించడంలో లక్నో సూపర్ జెయింట్స్ తడపడింది. చివరి ఓవర్లలో 14 పరుగులు చేయాల్సి ఉండగా, స్టోనీస్ , అవేశ్ ఖాన్ 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఈ మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది. 3 పరుగుల తేడాతో లక్నో పై రాజస్థాన్ గెలుపు నమోదు చేసింది.