ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్షకు రాకేశ్ తికాయత్ మద్దతు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడటం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుందని తికాయత్ హెచ్చరించారు.