సునిశిత్ ను చితక్కొట్టిన రామ్ చరణ్ ఫ్యాన్స్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : టాలీవుడ్ అగ్రనటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, తన నోటి దూలతో గతంలో పలు వివాదాలకు కారణమైన శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ తాజాగా మరో వివాదంలో ఇరక్కున్నాడు. ఓ యూ ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనను ఉద్దేశించి మాట్లాడాడు. ఉపాసన తనకు క్లోజ్ ఫ్రెండ్ అని, తనతో లాంగ్ డ్రైవ్ కోసం గోవా వెళ్లామన్నాడు. అంతేకాకుండా ఉపాసనను పడేయమని రామ్ చరణ్ చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా రామ్ చరణ్ అక్క సుస్మితతో కూడా లాంగ్ డ్రైవ్ కి వెళ్లినట్లు వాగాడు.
ఈ వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సునిశిత్ ఇంటి అడ్రస్ వెతుక్కొని వెళ్లి దాడిచేశారు. అనంతరం సునిశిత్ తో క్షమాపణలు చెప్పించారు. మీడియా ముందు సునిశిత్ మాట్లాడాడు. ” ఉపాసనపై తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పొరపాటున అలా మాట్లాడానని అన్నారు. తాను చేసిన తప్పుడు వ్యాఖ్యల వల్ల రామ్ చరణ్ అభిమానులు తనను కొట్టినట్లు సునిశిత్ తెలిపారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయను. ఏ హీరో, హీరోయిన్ కోసం మాట్లాడను, ఉపాసన వదినమ్మకి, రామ్ చరణ్ కి నా క్షమాపణలు, తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు నేను బాధపడుతున్నానని” సునిశిత్ తెలిపాడు.