నిఘా నీడలో రామప్ప దేవాలయం

నిఘా నీడలో రామప్ప దేవాలయం

నిఘా నీడలో రామప్ప దేవాలయం

 

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : రామప్పకు రాష్ట్రపతి రాక సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం నిఘా నీడలో ఉంది. శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణలో 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 28న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రామప్ప ఆలయ ప్రాంగణాన్ని పోలీసులు పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, ఎన్ఎస్ జీ బృందం ఏర్పాట్లను పరిశీలించారు. దీని కోసం మూడు ప్రత్యేక హెలిప్యాడ్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు, రేపు రెండు రోజుల పాటు సాధారణ ప్రజలకు రామప్ప సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.