హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందును అందించి, ఉర్రూతలూగించేందుకు “ఊర్వశి ఓటిటి” సర్వ సన్నాహాలు చేసుకుంటుండం తెలిసిందే. ఈ నెలాఖరు వరకు ‘ఇనాగురల్ ఆఫర్’గా ఉచిత వినోదం పంచనున్న “ఊర్వశి ఓటిటి” ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా “రామ్ లోపాల్ వర్మ” చిత్రాన్ని ఉచితంగా చూపించనుంది. ప్రముఖ దర్శకుడు వీరు కే రూపొందించిన ఈ చిత్రంలో షకలక శంకర్, ఆర్లిన్, డీఎస్.రావు, మధురిమ, లక్కీ, ఫిష్ వెంకట్, శశికాంత్, హర్షద పటేల్ ముఖ్య పాత్రలు పోషించారు.‘ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతున్న “ఊర్వశి ఓటిటి” ఇనాగురల్ ఆఫర్ గా ‘రామ్ లోపాల్ వర్మ’స్ట్రీమింగ్ కానుండడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకువెళ్లిన దర్శకుడు ఇప్పుడు అదే తెలుగు సినిమా స్థాయిని పాతాళంలోకి తీసుకువెళ్తుండడాన్ని జీర్ణించుకోలేక సదరు దర్శకుడిపై ఇప్పటికీ గల గౌరవంతో, ఆవేదనతో అతని లోపాలను ఎత్తి చూపుతూ, అతని పూర్వ వైభవాన్ని కోరుకుంటూ రూపొందించిన చిత్రం ‘రామ్ లోపాల్ వర్మ’.వినోదానికి పెద్ద పీట వేస్తూ విమర్శనాత్మకంగా, ఆలోచన రేకెత్తిస్తూ తెరకెక్కిన “రామ్ లోపాల్ వర్మ” అందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది” అన్నారు చిత్ర రూపకర్త వీరు కే
ఈ చిత్రానికి కెమెరా : గోపి కాకాని, ఎడిటింగ్ : అల్లియో , డాన్స్ : రామారావు , ఫైట్స్ : కృష్ణ, రచన-నిర్మాణం-దర్శకత్వం : వీరు కే