ఏపీలో న్యూడ్ డ్యాన్స్ లు..పలువురు అరెస్ట్
వరంగల్ టైమ్స్, తూ.గో జిల్లా : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పంగలా గ్రామంలో న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించారు. కొంత మంది అమ్మాయిలతో ఓ పది మంది వ్యక్తులు కలిసి నగ్నంగా డ్యాన్సులు చేయించారు. పోలేరమ్మ జాతర సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఈవెంట్ నిర్వహించారు.ఈ విషయంపై స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని న్యూడ్ డ్యాన్స్ ఈవెంట్ నిర్వహించిన వారితో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.