తిరుమల : శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ లో సోమవారం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ ఆన్లైన్ లో ఉంచింది. ప్రతీ రోజు 10 వేల టిక్కెట్ల చొప్పున జనవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. అయితే సైట్ లో విడుదల చేసిన 15 నిమిషాల్లోనే ఈ టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి.
మరోవైపు జనవరి 13 నుంచి 22 వరకు మాత్రం కేవలం 5వేల టిక్కెట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది. వైకుంఠ ఏకాదశి ఉన్నందునే ఇలా చేసినట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా టీటీడీ ఆన్లైన్ లోనే టిక్కెట్లను ఉంచుతోన్న విషయం విదితమే.