పోలింగ్‌లో చిచ్చుపెట్టిన గుర్తు
అర్థాంతరంగా ఆగిపోయిన పోలింగ్
3న ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్: ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల పరిధిలోని ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు , రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ పార్థసారధి చెప్పారు. డివిజన్లోని పోలింగ్ నమూనా బ్యాలెట్లో పత్రంలో సీపీఐ కంకికొడవలి గుర్తుకు బదులు సీపీఎం గుర్తు సుత్తె కొడవలి గుర్తును ప్రింట్ చేశారు. అయితే ఇది గమనించిన సీపీఐ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎలక్షన్ కమిషన్ మలక్ పేట్ డివిజన్ బ్యాలెట్ వ్యవహారంలో ప్రింటింగ్ ప్రెస్ లో సింబల్ ప్రింట్ తప్పు పడిందని వివరించారు. ఇక్కడ ఈ నెల మూడో తేదీన ఓటింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.