హోలీ వేడుకలపై ఆంక్షలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హోలీ వేడుకలపై నగరంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకూ మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై అనుమతి లేదని తెలిపారు. సంబంధం లేని వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.