హైదరాబాద్: కరోనా దృష్ట్యా శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి స్వామివారి స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అన్నప్రసాదం, వేదాశీర్వచనం, పుణ్యస్నానాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. భక్తులు ఆన్లైన్లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఈవో లవన్న సూచించారు.