కవిత ఆధ్వర్యంలో రేపు మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : భారత్ జాగృతి అధ్యక్షురాలు, రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత రేపు ఢిల్లీలో మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు లే మెరిడియన్ హోటల్ లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళా బిల్లుపై గళం వినిపించిన ఎమ్మెల్సీ కవిత దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.