ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వ ఖజానాకు రూ. 112.98 కోట్లు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ వేగవంతంగా జరుగుతోంది. మార్చి 1 నుంచి 20వరకు 1.2 కోట్ల చలాన్లను క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఇప్పటి వరకు రూ. 112.98 కోట్లు జమ అయ్యాయి.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 63 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా, రూ. 49.6 కోట్ల ఆదాయం వచ్చింది. సైబరాబాద్ పరిధిలో 38 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా, రూ. 45.8 కోట్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 లక్షల చలాన్లు క్లియరెన్స్ కాగా, రూ. 15.3 కోట్లు జమ అయ్యాయి. ఈవెసులుబాటు మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది.