అమరావతి : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ సైనికుడు లాన్స్ నాయక్ బీ సాయితేజ కుటుంబానికి ఏపీ గవర్నమెంట్ అండగా నిలిచింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఈనెల 8న జనరల్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ , ఆయన సతీమణి మధులిక రావత్ , సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఆర్మీ హెలికాప్టర్ లో తమిళనాడులోని సూలూరు నుంచి వెల్లింగ్టన్ కు వెళ్లుండగా ప్రమాదం జరిగింది.
హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టి మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లోని 14మందికిగాను బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు తీవ్రంగా కాలినగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.