ముంబై : మాస్టర్ బ్లాస్టర్ సచిన్, బారత మాజీ క్రికెట్ దిగ్గజం మారోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. క్లిష్టమైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లల వైద్యానికి అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చాడు. ఏకమ్ ఫౌండేషన్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, అసోం, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో వంద మంది పిల్లలకు సచిన్ సాయం అందించనున్నాడు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ట్రస్ట్ దవాఖానల్లో చికిత్స అయ్యే ఖర్చు తన ఫౌండేషన్ ద్వారా సమకూర్చబోతున్నాడు. ప్రస్తుతం యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్..వైద్య సహాయం విషయంలో పెద్ద మనసు చాటుకుని ఔదార్యం చూపారు.