హైదరాబాద్ : టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జాతో కలిసి సరదాగా గడుపుతోంది. అతడి చిలిపి పనులను ఆస్వాదిస్తోంది. చిన్నారునితో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటోంది. తాజాగా ఆమె తన చిన్నారునితో దిగిన ఫోటోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఆమె టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనడంలేదు. ఈ సమయానిన ఆమె తన కుమారునితో ఆనందంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.