మైక్రోసాఫ్ట్ సీఈవో కు పుత్ర వియోగం
వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల ( 26 ) మృతి చెందాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఆయన తుదిశ్వాస విడిచాడు. జైన్ మరణ వార్తను సత్య నాదెళ్ల ఈ-మెయిల్ ద్వారా మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి తెలియచేశారు. మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సత్య నాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది.అయితే పుట్టకతోనే జైన్ నాదెళ్ల సెరెబ్రల్ పాల్టీ ( మస్తిష్క పక్షవాతం )తో బాధపడుతున్నాడు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. తన కుమారుడు జైన్ ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో సత్య నాదెళ్ల వివరించేవారు.