హైదరాబాద్: ప్రముఖ సీనియర్ సినీ నటులు, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. రావికొండల రావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆయన నటుడిగానే కాకుండా సినీ రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. రాముడు భీముడు, తేనె మనసులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొంగలు, అందాల రాముడు, దసరా బుల్లోడు చిత్రాలు సహా 600కు పైగా చిత్రాల్లో నటించి అందరి అభిమానం చూరగొన్నారు. రావికొండల రావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులు.