ఐఏఎస్ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా

హైదరాబాద్​ : వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ ఉద్యోగం నుంచి ఆయన స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా ఓదెల.

1991 లో గ్రూప్-1 అధికారిగా వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరారు. మచిలీపట్నం, చిత్తూరు, తిరుపతిలో ఆయన ఆర్డీవోగా పనిచేశారు. మెదక్‌లో డ్వామా పీడీగా, హుడా సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన ఏడేళ్లు జేసీగా, కలెక్టర్‌గా పని చేశారు.