సీఎం జగన్ కు సిరివెన్నెల ఫ్యామిలీ థాంక్స్
వరంగల్ టైమ్స్, అమరావతి : దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి, కుటుంబ సభ్యులు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు, అండగా నిలిచినందుకు సీఎం వైఎస్ జగన్‌ను సిరివెన్నెల కుటుంబసభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సిరివెన్నెల అనుబంధాన్ని సీఎం జగన్ తో సిరివెన్నెల కుటుంబసభ్యులు పంచుకున్నారు.
సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, ఆ కుటుంబానికి విశాఖలో ఇంటి స్ధలం మంజూరు చేసింది ఏపీ సర్కార్. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఇవ్వనున్నట్లు ఆయన కుటుంబానికి భరోసానిచ్చిన సీఎం వైఎస్ జగన్.