హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావిణ్య రెడ్డిని 31వ డివిజన్ కార్పొరేటర్ మామిండ్ల రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. 31వ డివిజన్ లోని పలు సమస్యలపై కమిషనర్ కు వినతిపత్రం అందించారు. అనంతరం డివిజన్ లోని పలు సమస్యలను కమిషనర్ కు కార్పొరేటర్ రాజు వివరించారు.
తన డివిజన్ లోని స్మశాన వాటికల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యలు, మిషన్ భగీరథ పనులు, రోడ్లు, తాగునీటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రావిణ్యరెడ్డిని కోరారు. డివిజన్ లోని పలు పనులకై మున్సిపల్ సిబ్బందిని మరింత పెంచాలి పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన కమిషనర్ ప్రావిణ్య రెడ్డి 31వ డివిజన్ లో పర్యటించి, తమ దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజుతో పాటు, స్థానికులు పాల్గొన్నారు.