భారీగా పట్టుబడిన గంజాయి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్ ఓటి పోలీసులు సైబరాబాద్ లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు యూపీ వాసులు పరారీలో ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.