బెంగళూరు టెస్టులో 109 రన్స్ కే శ్రీలంక ఆలౌట్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: బెంగళూరులో టీమిండియా – శ్రీలంక మధ్య జరుగుతున్న డై అండ్ నైట్ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కు శ్రీలంక దాసోహమవ్వక తప్పలేదు. బుమ్రా తన బౌలింగ్ తో 5 వికెట్లతో విజృంభించగా, శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 86-6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక, కొద్దిసేపటికే పెవిలియన్ కు చేరింది.నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీసిన బుమ్రా, నేడు ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీశాడు. అశ్విన్ మరో రెండు వికెట్లు పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ లో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేయగా, ఎంబుల్దెనియా 21 రన్స్ చేశాడు. కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 252 రన్స్ చేయడంతో 143 రన్స్ ఆధిక్యం లభించింది.