వరంగల్ టైమ్స్, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానానికి నిన్న రూ.2.46 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 41,463 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వారిలో 21,975 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. శనివారం రాత్రి శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు నుంచి 28 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయంలో ఏకాంతంగా జరగనున్నాయి.
Home News