సిరివెన్నెలకు సుప్రీం కోర్టు సీజే శ్రద్ధాంజలి


హైదరాబాద్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అనే తననెంతో కలచివేసిందన్నారు. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదిందన్నారు.

నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సీతారామశాస్త్రి సుసంపన్నం చేశారని గుర్తు చేశారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు సానుభూతి తెలిపారు.