మార్చి 18న సస్పెన్స్ థ్రిల్లర్ “డైరెక్టర్” రిలీజ్
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులలో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెరకెక్కిస్తే ఈ జోనర్ లో సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. ఆ విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కి ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్న చిత్రం “*డైరెక్టర్*”. నాటకం సినిమా తో నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్న ఆశిష్ గాంధీ హీరోగా ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజన్ సినిమాస్ బ్యానర్ పై డా.నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నిర్మాత నాగం తిరుపత రెడ్డి ఓ కీలక పాత్రలో కూడా కనిపించారు. దర్శక ద్వయం కిరణ్ పొన్నాడ-కార్తీక్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి, టీజర్ కి, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా పై కూడా అంచనాలను పెంచాయి. రాజా ది గ్రేట్, పటాస్, సుప్రీమ్ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. బి.నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా ఆదిత్య వర్దిన్ ఛాయాగ్రాహకుడుగా పనిచేశారు. కాగా ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
నటీనటులు : ఐశ్వర్య రాజ్, మరీనా, ఆంత్ర, జబర్దస్త్ అప్పారావు, వీరభద్రం, తిరుమలరెడ్డి, ఆర్కే, తదితరులు
నిర్మాతలు : నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల
రచన-దర్శకత్వం : కిరణ్ పొన్నాడ, కార్తీక్ కృష్ణ.
కో-ప్రొడ్యూసర్ : తిరుమల రెడ్డి ఎల్ల
సంగీతం : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : ఆదిత్య వర్ధన్
ఎడిటింగ్ : బి. నాగేశ్వర్ రెడ్డి