వరంగల్ అర్బన్ జిల్లా: తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ కెరటం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు చిటూరి అశోక్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా చిటూరి అశోక్ తో పాటు పలువురు టిడిపి శ్రేణులు బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం టిడిపి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసి , లక్ష్యం సాధించే వరకు ఉద్యమాన్ని బతికించిన పోరాటయోధుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చిటూరి అశోక్ అన్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తి దిశగా నడుస్తున్నామని చెబుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని తుంగలో తొక్కుతుందని మండిపడ్డారు. జయశంకర్ సార్ కు గుర్తుగా బాలసముద్రం ఏకశిలా పార్కులో స్మృతి వనం ఏర్పాట్ల విషయంలో సిఎం కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6నెలల్లో జయశంకర్ స్మృతి వనాన్ని సుందర వనంగా మార్చు తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి 6సంవత్సరాలు గడిచినా అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్.టీ సెల్ ప్రధాన కార్యదర్శి నరేష్ నాయక్ , రామావత్ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పోతరాజు అనిల్ కుమార్ , సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు మార్గం సారంగం, ముక్కిరాల జనార్దన్ రావు, వల్లెపు శ్రీనివాస్, పిట్టల శ్రీనివాస్, వెలగందుల రవీందర్ గుప్తా, శివరాత్రి వెంకన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.