త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను త్వరలోనే చేపడుతామని సీఎం శాసనసభా వేదికగా ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా రాష్ట్రంలోని నేరుగా నియామకం చేయాల్సిన ఖాళీల సంఖ్య 80,039 ఉన్నట్లు తేలిందని సీఎం పేర్కొన్నారు.