రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు.
ఆర్థిక శాఖకు రూ. 49,749 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.26,885 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు
విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
విద్యాశాఖ రంగానికి రూ.12,161 కోట్లు
ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1463 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
రోడ్లు,భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు
పురపాలక శాఖకు రూ. 11,327 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
ప్రణాళిక విభాగానికి రూ.11,495 కోట్లు
ఐటీ, కమ్యునికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.15,075 కోట్లు
రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు
రైతుబీమా పథకానికి రూ. 1589 కోట్లు
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 12000 కోట్లు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ.3,210 కోట్లు
దళితబంధు కోసం రూ.17,700 కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు
ఎస్సీ ప్రత్యేకనిధి కోసం రూ.36,750 కోట్లు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
అటవీ శాఖ కోసం రూ.1,471 కోట్లు
హరితహారం పథకానికి రూ. 1,471 కోట్లు
ఆయిల్ ఫామ్ కు రూ.1000 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమానికి రూ.4,8334 కోట్లు
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి రూ.12,000 కోట్లు