కొండపోచమ్మ రిజర్వాయర్‌ ను ప్రారంభించిన కేసీఆర్‌

కొండపోచమ్మ రిజర్వాయర్‌ ను ప్రారంభించిన కేసీఆర్‌

వరంగల్ టైమ్స్ , సిద్దిపేట : కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. కొండపోచమ్మ జలాశయాన్ని శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిజీతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు నేడు ప్రారంభించారు. మర్కూక్‌ పంప్‌హౌస్‌ నుంచి ఈ రిజర్వాయర్‌లోకి గోదావరి నీటి చేరికతో కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుతఘట్టం ఆవిషృతమైంది. కొండపోచమ్మ సాగర్‌కి నీరు చేరికతో అత్యంత ఎత్తుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్‌, చినజీయర్‌ స్వామి కలిసి గంగపూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్‌లో కలిపారు. కొండపోచమ్మ సాగర్‌లోకి నీరు చేరికతో ప్రాజెక్టులోని తుది.. 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అదేవిధంగా హైదరాబాద్‌ మహానగర తాగునీటి అవసరాలు తీర్చేలా 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మ రిజర్వాయర్‌ నిర్మాణం జరిగింది.