జనగామ జిల్లా : జనగామ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు కలెక్టర్ కార్యాలయంలోని అమరవీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ సారు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి, జెడ్పి చైర్మన్ పగల సంపత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ సారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగ నిర్వహించామని ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామజిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సి.ఎం., ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి అమరుల త్యాగాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు , తదితరులు పాల్గొన్నారు.