వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం లో వీర మరణం పొందిన అమర వీరులను స్మరించుకుంటూ హన్మకొండ అదాలత్ సెంటర్ లోని అమర వీరుల స్మారక స్తూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పూలాభిషేకం చేసి నివాళులర్పించారు. ప్రభుత్వ చీఫ్ విప్ తో పాటు వరంగల్ అర్బన్ , రూరల్ జిల్లాల కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, హరిత, మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్ అర్బన్ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ , ఎంపీలు పసునూరి దయాకర్ ,వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మాజ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అదనపు కలెక్టర్లు యస్. దయానంద్, ఆర్.మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను నెమరువేసుకున్నారు. అనంతరం జులై వాడలోని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాస్యం వినయ్ భాస్కర్ జాతీయ జెండా ఎగురవేశారు. జాతీయ గీతాలాపన చేసి, పోలీసుల వందనాన్ని స్వీకరించారు.