హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్19 పరీక్షలో ఆయన పాజిటివ్‌గా తేలారు. జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో హోంమంత్రి మహబూద్ అలీ అడ్మిట్ అయ్యారు. గత బుధవారం.. ఆయన వద్ద ఉన్న అయిదుగురు గన్మెన్లు.. కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం మహమూద్ అలీ ఆరోగ్యం నిలకడగా ఉన్నది. హాస్పిటల్ సిబ్బంది ఆయన్ను అనునిత్యం పరీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం హాస్పిటల్లో చేరినట్లు అధికారులు చెబుతున్నారు.