హోంమంత్రి కోలుకొన్నారు
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ఇటీవల కరోనా బారినపడిన హోంమంత్రి మహమూద్ అలీ కోలుకొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంతో అపోలో వైద్యులు శుక్రవారం డిశ్చార్జిచేశారు. ‘దేవుడికి కృతజ్ఞతలు. నా కోసం ప్రార్థించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమకు, అభిమానానికి పెద్ద థ్యాంక్స్’ అంటూ హోంమంత్రి ఓ సందేశంతోపాటు కుమారుడు, మనుమడితో కలిసి ఉన్న ఫొటోను మీడియాకు విడుదలచేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌కుమార్, మాజీ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.