వ్యాపార రంగానికి స్వర్గధామం తెలంగాణ : కవిత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వ్యాపార సంస్థల ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18000 వేల కొత్త వ్యాపారాలు ప్రారంభమై 2.62 లక్షల కోట్ల పెట్టుబడులతో, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించాయని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన వైశ్య లైమ్ లైట్ అవార్డుల కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక సబ్పీడిలు, సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. వివిధ వ్యాపార రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఎమ్మెల్సీ కవిత అవార్డులు అందజేశారు. వైశ్యులు సాంప్రదాయంగా చేసే వ్యాపారాలతో పాటు, పలు విభిన్న రంగాలు, సేవా కార్యాక్రమాల్లోనూ పాల్గొంటున్నారన్నారు.
భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు త్యాగాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీ కవిత, సంతోష్ సతీమణికి అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు.