నల్లగొండ జిల్లా : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం సాయంత్రం బొత్తలపాలెం వద్ద బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న అన్నా చెల్లెలితో పాటు అల్లుడు మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను నల్లగొండ జిల్లా వాడపల్లికి చెందిన అల్లాచెల్లెలు ధనవత్ అంజలి, ధనవత్ అంజి, అల్లుడు రమావత్ నవదీప్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే ఇంట్లో ముగ్గురి మృతితో బాధిత కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.