కారులో మంటలు..ముగ్గురు సజీవ దహనం
వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఘోరం జరిగింది. కంబం నుంచి శ్రీశైలం వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ కారు లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైపోయింది.కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమైపోయారు. మరోవైపు కారులో చెలరేగిన మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన జరగడంతో లారీ డ్రైవర్, క్లీనర్ లారీని అక్కడే విడిచి, పరార్ అయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.