ప్రభుత్వం,ఉద్యోగులు వేరు కాదన్న మంత్రి


నిజామాబాద్ జిల్లా: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని ప్రభుత్వం , ఉద్యోగులు కలిస్తేనే ప్రజలకు సేవ చేయగలుగుతామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ ,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన కారం రవీందర్ రెడ్డి కి బుధవారం నిజామాబాద్ టీఎన్జీవోస్ భవన్​లో సన్మాన కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వేముల ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. ‘పాజిటివ్ దృక్పథంతో వెళ్లేవారికి అన్ని అనుకూలంగా ఉంటాయని ,ఎన్ని ఒత్తిళ్లు ఉన్న రవీందర్ రెడ్డి సంయమనంతో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేశారని, సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఆయనకు ఉందని ఆయన సేవలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తామమని మంత్రి తెలిపారు.రాష్ట్ర సాధనలో అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. కొన్ని పరిస్థితుల వల్ల పీఆర్సీ ఆలస్యమైందని త్వరలోనే అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.సీడీఎఫ్ నిధులు విడుదల కాగానే ఇతర సభ్యులతో కలిసి టీఎన్జీవోస్ సంఘ కల్యాణ మండపానికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని’ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.‘ ప్రభుత్వ లక్ష్యాలను, పథకాలను ముందుకు తీసుకు వెళ్లడం లో ఉద్యోగుల భాగస్వామ్యం వెలకట్టలేనిదని ఏ పథకమైనా ఉద్యోగుల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని తెలిపారు. ఉద్యోగులు ఇకముందు కూడా ఇదే సహాయ సహకారాలు అందించి జిల్లాను ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలని’ కలెక్టర్​ నారాయణరెడ్డి కోరారు. ‘పెరుగుతున్న నిత్యావసర వస్తువుల కు అనుగుణంగా పీఆర్సీ వస్తుందని తమకు నమ్మకం గా ఉందని ప్రభుత్వం తమ సమస్యల పట్ల అనుకూలంగా స్పందించే అవకాశం ఉందని త్వరలోనే పీఆర్సీ పై తీపి కబురు వింటామని’ టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. అనంతరం కారెం రవీందర్ రెడ్డి కి మంత్రి, కలెక్టర్, టీఎన్జీవోస్ నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ నిజాంబాద్ కామారెడ్డి సంఘ అధ్యక్షులు కిషన్, దయానంద్ మున్సిపల్ చైర్ పర్సన్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ రెండు జిల్లాల టీఎన్జీవోస్ నాయకులు పాల్గొన్నారు.