వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఉమ్మడి నల్గొండ జిల్లాకు నూతనంగా మరో మూడు జాతీయ రహదారులను తీసుకురావాలన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృషి ఫలించింది. నేడు న్యూ ఢిల్లీలో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వారి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి నుంచి చిట్యాల వరకు 44 కి.మీల రహదారిని, అలాగే నల్లగొండ నుంచి మల్లేపల్లి వరకు దాదాపు 60 కి.మీలు రహదారిని, వీటితో పాటు కొమురవెళ్లి నుంచి యాదగిరిగుట్ట మీదుగా పాటిమట్ల వరకు 100 కి.మీల రోడ్డును జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భారత్ మాల -2లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 3 జాతీయ రహదారులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూతన జాతీయ రహదారుల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.
Home News