ఏపీ బీఆర్ఎప్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు ఖరారైనట్లు తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం . సీఎం కేసీఆర్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.తోట చంద్రశేఖర్ తో పాటు ఆయన నేతృత్వంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంకొంత మంది నేతలు కూడా సోమవారం హైదరాబాద్ వచ్చి ఇదే వేదికపై కేసీఆర్, తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఏపీలో పలు రాజకీయ పార్టీల్లో తమ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.