హైదరాబాద్: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఓటుకు కోట్లు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)ను ఆశ్రయించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారినందుకు తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కేసులో తనకు ఈడీ నుంచి నోటీసులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలే ముఖ్యసూత్రదారులని చెప్పారు. కేసు పూర్తయ్యే వరకు తనకు పూర్తి రక్షణ కల్పించాలని పిర్యాదులో కోరారు. అదేవిధంగా ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.