చత్తీస్ ఘడ్ : మావోయిస్ట్ లతో సంబంధం ఉన్న ముగ్గురు సానుభూతి పరులు సుక్మా జిల్లా పోలీసులకు స్వచ్ఛందగా లొంగిపోయారు. వీరిని మద్వి (40), మద్వి (20), కట్టం హుందా (30) లుగా గుర్తించారు. మావోయిస్ట్ లకు వ్యతిరేకంగా చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు పునరావాస విధాన కార్యక్రమాన్ని చేపట్టారు. గిరిజనులతో నిర్వహించిన ఈ సమావేశాల ద్వారానే మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో సుక్మా జిల్లా కమాండెంట్ లు, సీపీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
Home Crime