కాంకేర్ జిల్లా: పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కొద్దిసేపటి క్రితం జరిగిన ఓ ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన పొరుగున గల ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లా రావ్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొసరోండాలో జరిగింది. ఘటనా స్థలి సమీపంలో రైల్వే ట్రాక్ నిర్మాణానికి రక్షణగా వచ్చిన పోలీసు బలగాలపై రెండుసార్లు నక్సలైట్లు దాడి చేసినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళ సహా ముగ్గురు మావోయిస్టు నక్సల్స్ మరణించినట్లు తెలిపారు. ఇదే ఘటనలో మరో జవాన్ కూడా గాయపడినట్లు సమాచారం.