తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుని కలిసి వివాహ పత్రికతో స్వయంగా పెళ్లికి ఆహ్వానించారు నితిన్.హైదరాబాద్: భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో నితిన్ పెండ్లికి చెప్పలేనన్ని అడ్డంకులు వచ్చాయి. నితిన్-షాలిని వివాహ వేడుక ఏప్రిల్ 16న జరగాల్సింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ వైరస్ కాస్త సర్దుమనిగిన తర్వాత చేసుకుందాం అని ఇన్నిరోజులు ఆగారు ఈ జంట. కరోనా వచ్చి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నెల జులై 26న రాత్రి 8.30 నిమిషాలకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిపారు. వివాహ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ని.. హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. హైదరాబాద్ ఫలక్నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు నితిన్. ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో నితిన్ – షాలిని ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని పెద్దల అంగీకారంతో ఒకటి కాబోతున్నారు. వాస్తవానికి ఏప్రిల్‌లో దుబాయ్‌లో వీరిద్దరూ పెళ్ళికి ప్లాన్ చేసుకోగా.. కరోనా వైరస్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. ఇక ఈ నెల 26న వారిద్దరికీ సరిపోయేలా ముహూర్తం కుదరడంతో వధూవరుల కుటుంబ సభ్యులు ఈ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఏదైతేనేం కరోనా టైంలోనే యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా అయిపోతుదందన్నమాట.