ఇక నుంచి సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా జరిగింది. ఈ కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు పూజలు నిర్వహించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సూపర్ లగ్జరీ బస్సు ప్రత్యేకతలను ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.