అంబేద్కర్ జయంతి వేడుకల్లో చల్లా ధర్మారెడ్డి
వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : రాజ్యాంగ నిర్మాత , భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడని పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి తోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. డా.బిఆర్ అంబేద్కర్ 131 జయంతిని పురస్కరించుకునా పరకాల నియోజకవర్గంలో పలువురు నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గం నడికూడ మండల కేంద్రంలో ఎపిలిజెంట్స్ మరియు యువశక్తి యూత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 131వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే చల్లా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళితుల సాధికారత కోసం , దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.