కొన్నెలో ఘనంగా డొనాల్డ్ ట్రంపు 74వ బర్త్ డే వేడుకలు నిర్వహించిన వీరాభిమాని బుస్స క్రిష్ణ
జనగామ జిల్లా: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపు 74వ జన్మదిన వేడుకలను ట్రంపు వీరాభిమాని ట్రంపు క్రిష్ణ అలియాస్ బుస్స క్రిష్ణ నిర్వహించాడు. జనగామ జిల్లా కొన్నెగ్రామంలోని ఆయన నివాసంలో డొనాల్డ్ ట్రంపు బర్త్ డే వేడుకలను బుస్స క్రిష్ణ ఘనంగా నిర్వహించాడు. ట్రంపు బర్త్ డే సందర్భంగా గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ట్రంపుకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన బుస్స క్రిష్ణ తాను దేవుడిగా కొలిచే ట్రంపు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్ధించాడు. గతంలో ట్రంపు బర్త్ డే సందర్భంగా రక్తదానం చేయడంతో పాటు ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాపాయస్థితిలో ఎవరున్నా రక్తదానం చేసేందుకు తాను సిద్ధంగావున్నట్లు బుస్స క్రిష్ణ తెలిపాడు. కరోనా వ్యాప్తికి కారణమై ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనా దేశం అధ్యక్షుడు జిన్ పింగ్ చిత్రపటానికి చెప్పులదండ వేసి నిరసన తెలిపాడీ. అంతేకాకుండా భారతదేశం ,అమెరికా మధ్య స్నేహపూర్వకమైన సత్సంబంధాలు కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ , ట్రంపులు సోదరభావంతో వుండాలని కోరుతూ భగవంతున్ని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాను నియంత్రించేందుకు భారత్ , అమెరికాల సంయుక్తంగా కృషి చేసి వ్యాక్సిన్ అందించి కరోనా నుంచి ప్రజలను కాపాడాలని భగవంతున్ని వేడుకున్నట్లు బుస్స క్రిష్ణ తెలిపారు.