వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో tuwj ( iju) విజయం
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అనుబంధ టీయూడబ్ల్యూ జే విజయం సాధించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 591 ఓటర్లకు గాను 572 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి స్థానాలను ఐజేయూ దక్కించుకుంది.పోలైన 572 ఓట్లను కౌంటింగ్ అధికారులు రౌండ్ కు 25 చొప్పున 23 రౌండ్లలో లెక్కించారు. పోటాపోటీగా జరిగిన ఈ కౌంటింగ్ లో చివరి వరకు అధ్యక్ష పదవికి పోటీపడిన వేముల నాగరాజు, శ్రీధర్ రెడ్డి లో చివరకు విజయం నాగరాజును వరించింది. ప్రధాన కార్యదర్శి పదవికి బొల్లారపు సదయ్య, కక్కెర్ల అనిల్ పోటీపడగా సదయ్య గెలుపొందారు. కోశాధికారిగా స్వతంత్ర అభ్యర్థి బోళ్ల అమరేందర్, ఉపాధ్యక్షులుగా గోకారపు శ్యాం కుమార్, బొడిగే శ్రీనివాస్, కె.దుర్గాప్రసాద్, అల్లం రాజేశ్ వర్మ, యాంసాని శ్రీనివాస్ గెలుపొందారు.
విజేతలకు ధ్రువపత్రాలు అందించారు. గెలుపొందిన అభ్యర్థులను ఐజేయూ జాతీయ, రాష్ట్ర నేతలు విరాహత్ అలీ, కృష్ణారెడ్డి, నంగునూరు శేఖర్, దొంతు రమేష్, రామచందర్, బుచ్చిరెడ్డి, సుధాకర్ తదితరులు అభినందించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ జర్నలిస్ట్ శామంతుల శ్రీనివాస్ వ్యవహరించారు.